ప్రాతూరి శాస్త్రి - 24.10.2020.....           24-Oct-2020

విశాఖ పురస్కారం సుమధురయానం – 1

20.12.2019

సెప్టెంబర్ నెలలో ఈనాడు దినపత్రికలో ప్రచురితమైంది.

"అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" 2019 పురస్కారాలలో మనకోసం మనం ట్రస్టుకి డిసెంబర్ 21సేవారత్న పురస్కారం ఇస్తారని ప్రచురితమైంది. చాలా ఆనందం కలిగింది.

ఆ సంవత్సరం 2 పురస్కారాలు. అందులోనూ అమెరికావారు ఇస్తుంది.

అప్పుడు నా ఆరోగ్యరీత్యా నేను విశాఖపట్నంలోని మా అబ్బాయి రవి దగ్గరనే ఉన్నాను.

స్వచ్ఛ సుందర చల్లపల్లి లోని శ్రమసంస్కృతి అమెరికాలోని డల్లాస్ వారు డాక్టర్ గారిని అడగడం.

ఫోన్ సంభాషణలు తెలీవు ఎవ్వరికీ.

Organization వేరు, administration వేరు. ఈ రెండూ పూర్తి అవగాహన ఉన్నవారే ఉద్యమాన్ని సమర్ధవంతంగా నడపగలుగుతారు.

సహనం, సాహసం ఒకేచోట ఉండబట్టే స్వచ్ఛ ఉద్యమం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

నవంబర్ నుండే యాత్రాసన్నాహాలు మొదలుపెట్టాం.

కార్యక్రమం ఏర్పాట్లు చూసే ఆసుపత్రి సిబ్బంది లక్ష్మితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ విశాఖలో ఉండడడానికి వసతి ఏర్పరిచాను. రాత్రికి బయలుదేరుతున్నాం అని చెప్పింది.

రాత్రి 8గం. గ్రూపు లో ప్రయాణం ఫోటోలు చూడగానే అమ్మయ్య తెల్లారగానే అందరూ కలుస్తారు అనుకోగానే కాస్త గుండె దడగుడా వచ్చింది. ఎవరికీ చెప్పలా.

రేపు వెళ్లనీకపోతే ఎలా అని!

తెల్లవారింది. మా అబ్బాయి రవి నాన్న గారిని కూడా తీసుకెళ్ళండి. మన వాళ్ళంతా ఉన్నారు గదా, సాయంత్రం తేడావస్తే యన్ ఆర్ ఐ హాస్పిటల్ కి తీసికొనిపోతానన్నాడు. కాస్త ధైర్యం వచ్చింది.

విశాఖ పురస్కారం సుమధురయానం – 2

ఓ పురస్కార యాత్ర చేస్తున్నాం అంటే డాక్టర్ గారు, డాక్టరమ్మగారు తీసుకొనే జాగ్రత్తలు వెరైటీగా వుంటాయి.

కొంతమందికే తెలుసు. మేం నడిపిన క్యాంపులు గుర్తుకొస్తాయి.

సూదినుండి చెత్తబుట్ట వరకు అన్నీ ఉంటాయి. వారిరువురి administration గొప్పగా ఉంటుంది.

అందుకేనేమో I admire them very much.

టిఫిన్లు చేసాం. బస్ బయలుదేరింది. కూనిరాగాలు మొదలైంది. మా మోహనరావు పాట దారిజూడు దుమ్ముజూడు తో ప్రారంభం.

ఓ నూతనపోకడ డా. పద్మావతి గారి నోటినుండి వచ్చింది. ఎవరి పెళ్లిళ్లు ఎలా జరిగాయి. ప్రేమ వివాహమా, కుదిర్చినదా అని అడిగారు.

ఒక్కసారి అందరూ చిన్నపిల్లలైనారు.

ఆనాటి రోజులు తలచుకుని మురిసినవారు, వారి కళ్ళలో మెరుపులు, భార్యాభర్తలైతే ఆ రోజులు తలచుకొని రెచ్చిపోయారు.

ఇది కదండీ నిజమైన ఆనందం. జీవితంలో మధురాతి మధురఘట్టం, ఎప్పుడు తలచినా ఆనందాశ్చర్యాలు కలుగుతాయి.

Hats off to Dr.Padmavathi madam.

ఎంత శ్రద్ధగా విన్నారో. మధ్యలో అంజయ్యగారి సన్నాయినొక్కులు, డాక్టరమ్మగారి చమక్కులు. సుమధుర యానం అంటే ఇది గదా. దాదాపుగా అందరివీ చుట్టరికాలే.

అందుకేనేమో ముత్యపుచిప్పలన్నీ ఒకచోటే చేరాయి

సంభాషణలన్నీ వ్రాస్తే ఓ గ్రంధామౌతుంది.

ఇంతలో బొర్రా గుహలు వచ్చాయి. కూసింత విరామం. బొర్రా గుహలు చూచి వద్దాం బస్సులోకి.

- ప్రాతూరి శాస్త్రి

24.10.2020.

 

రేపటి సంచికలో బొర్రాగుహలు, అరకు గురించి...