ప్రాతూరి శాస్త్రి - 25.10.2020. ....           25-Oct-2020

 విశాఖ...బొర్రాగుహలు – 20.12.2019

           1807 వ సం. లో విలియం కింగ్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త మొదటిసారిగా కనుగొన్నారు

రాయిలో కాల్షియం బై కార్బోనేట్ ఉండడంతో వాగులులోని నీటికి కరిగిపోయి సహజసిద్ధంగా గుహలు ఏర్పడ్డాయి.

గుహలలో కింద ఉన్న దిబ్బలు స్టాలగ్ మైట్స్ వల్ల, గుహలలో పైన రకరకాలుగా ఏర్పడ్డవి స్టాలకైట్స్ వల్ల.

మొత్తం 4 గుహలు ఏర్పడగా ప్రస్తుతం ఒక గుహలోకి మాత్రమే అదీ కొద్దిదూరమే వెళ్లగలుగుతున్నాము.

గుహలో ఒక కిలోమీటరు వెళితే గోస్తనీ నది వస్తుంది. కానీ దారి లేదు.

పర్యాటక సంస్థ వారు బయట ఉద్యానవనం, లోపల రంగురంగుల దీపాలతో అలంకరించారు.

అరకులోయకు ప్రకృతి అందించిన అద్భుతమైన బొర్రాగుహలు ఒక వరం.

మనవారు ఎన్నెన్నో ఫోటోలు దిగారు. చాలా ఆనందపడ్డారు.

వస్తూ అందరికీ స్వాదిష్టమైన బొంగుచికెన్ వేడివేడిగా వృకోదరునివాలే తిని సంతృప్తి జెందారు.

11.30కు వెళ్లినవారు 2 గం తృప్తిగా చూసి ఎనలేని ఆనందం మూటకట్టారు.

మధ్యాహ్నం1 దాటింది. ఒక్కొక్కరు రాసాగారు. ఇంతలో నరసింహారావు విస్తరిలో చిన్న చిన్న ముక్కలతో బస్సెక్కి వేడిపోతోంది అంటూ వెనుకనున్నవారికి పెట్టాడు.

తీరాచూస్తే మా 3 పులులు రాలా.

పులులు కాదులెండి మృగరాజులే తాజాగా ఉంటేనే లాగిస్తాం. పిచ్చిచచ్చినాళ్ళు ఊరికే బయటపడతారు మగాళ్లు. మూతులు తుడుచుకుంటూ భారీగా అడుగులేస్తూ బస్సెక్కారు.

మరీ ఆడవాళ్లేం తక్కువ కొంగుకి చేతులు తుడుచుకుంటూ ఎక్కారు.

మరి శాకాహారస్థులకేం దొరికిందో హడావుడిగా వస్తూ ఎక్కారు.

ఫోటోలు దిగినదానికన్న బొంగుచికెన్ చాలా సంతృప్తి నిచ్చింది.

ఎంతటి పెద్ద శరీరాలున్నా సంతృప్తి కలగాలంటే మంచి స్వాదిష్ట ఆహారం తరువాతే.

అలా సంతృప్తి చెందిన శరీరాలు నిద్రలోకి జారాయి.

అలా అలా ఘాట్లు ఎక్కి, మలుపులకు శరీరాలను తిప్పుతూ 3 గం కు అరకువాలీ హరిత రిసార్ట్స్ చేరాం.

మంచిగా ఆహారం స్వీకరించాం. స్విమ్మింగ్ పూల్ వద్ద, బయట ఫోటోలు దిగారు.

మనకోసమే అన్నట్లు థింసా నృత్యం చేసేవారు ఎదురుచూశారు.

అదోలోకం.

- ప్రాతూరి శాస్త్రి

25.10.2020.

 రేపటి సంచికలో థింసా నృత్యం, అరకు నుంచి విశాఖ ప్రయాణం గురించి...