ప్రాతూరి శాస్త్రి - 26.10.2020....           26-Oct-2020

 అదిగో నవలోకం, వెలిసే మనకోసం అన్నాడో సినీకవి.

నిజమే మరి. ధింసా డాన్స్ కోసం ప్రత్యేక స్థలం ఏర్పాటుచేశారు.

వాస్తవంగా వారందరూ గిరిజనులైనా చదువుకుంటున్నవారే.

చాలాబాగా అంటే చాలాబాగానే డాన్స్ చేశారు. వారి శైలిలో అన్నీ భంగిమలతో అలరింపజేశారు.

డాన్స్ చూడగానే మన కార్యకర్తలు గూడా కొందరు ధైర్యంగా, కొందరు మొహాలు చూచుకుంటూ డా. పద్మావతి గారు లయబద్దంగా వారితో కలియగా మహిళలు చేరి ధింసా నృత్యం చేశారు.

ప్రకృతిని పరిశీలించి చూడండి. మందసమీరానికి కొమ్మలు కదలుతాయి. స్త్రీ శక్తి కూడా అంతే. వారికి సహజసిద్ధమైనది నృత్యం.

ఓ గంట తెలియకుండా గడిచిపోయింది. మరిచిపోయే ఘటనాఅది. జీవితాంతం మరువం.

డా. పద్మావతి గారు రూ. 2000, నేనో ఉడతా భక్తిగా రూ.1000 లు వారికి అందజేసాము.

అప్పటికే సాయంత్రం 5 అయింది. మరల మాయాత్ర బొటానికల్ గార్డెన్స్ వద్ద. ఎన్నో రకరకాల సుగంధ ద్రవ్యాల చెట్లు, మందులలో ఉపయోగపడే చెట్లు చూస్తూ అందంగా ఫోటోలు దిగారు. మరల మ్యూజియం వద్ద వివిధ రకాల చిత్రాలు చూచి 7 గం బయలుదేరాం.

---        

అరకు వాలీ :

మన జీవితాల్లో రకరకాల ఫోబియాలు చూస్తూనే ఉంటాము.

ఎప్పుడైనా Vomiting phobia గూర్చి విన్నారా. మేము ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూసాము. ఆదో వింత అనుభూతి.

సహజంగానే ఉన్న కార్యకర్తలలో ముగ్గురు బస్సు పడనివారున్నారు. వారి జాగ్రత్తలు వారు తీసికొంటూనే వున్నారు.

తిరిగి వచ్చేటప్పుడు పూర్తిగా కిందకీ మలుపులతో కాస్త వేగంతో బస్సు వస్తుంది.

మలుపు మలుపుకి ఒక్కో వికెట్ వావావాక్, వావావాక్. ఇక చూడండి ముందు వాక్, కాసేపాగితే పక్కన వాక్, ముందు, వెనుక , పక్కన అన్నీ సూపర్ వాక్ లే.

దాదాపు 200 కవర్లు తెచ్చారు చాల్లేదు. బస్సు ఆపండి వెనుక నుండి కేక. కేకలు ఆగడంలేదు. బస్సు ఆగేట్లు లేదు. డ్రైవర్ కి చెప్పగా చెప్పగా ఓ గుడి కొత్తమ్మ గుడిట ఆపాడు.

మన డాక్టర్ గారికైతే ఈ వాక్ లు విని విని తలనొప్పి వచ్చింది.

కానీ ఇందులో గురకపెట్టి నిద్రపోయిన వారుగుడా వున్నారు.

గుడివద్ద అరగంట ఆపారు.

దేవుని దయో, మిగిలిన వారి అదృష్టమో ఈ వాక్ లు ఆగిపోయాయి. 

కొస మెరుపు ఆ రోజుకి

Vomiting లు అయిన తరువాత లడ్డులు తిన్నవారు కూడా వున్నారు.

ఎంతైనా పైన చెప్పినట్లు వృకోదరుని వారసులం.

అలా అలా రాత్రి 11.30 కి చేరాం. మొదటి రోజు ఈవిధంగా ఆనందంగా అంటే ఇదొరకమైన వింత వింత అనుభూతులతో గడిచింది.

- ప్రాతూరి శాస్త్రి

26.10.2020

21.12.19 విశేషాలతో రేపు కలుసుకుందాం.