ప్రాతూరి శాస్త్రి - 28.10.2020.....           28-Oct-2020

 అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 9 మంది సభ్యులతో అమెరికాలోని డల్లాస్ ప్రాంతం.

నాగేశ్వరరావు గారితో సన్నిహితంగా ఉండేవారు. వారి తదనంతరం వేరు సంస్థగా ఏర్పడి ఆయనపేరున 6 సం. గా పురస్కారాలు తెలుగునాట ఒక్కొక్క సం. ఒక్కొక్కచోట ఇస్తున్నారు. ఈ సంవత్సరం విశాఖలో ఏర్పాటుచేశారు.

పురస్కార గ్రహీతలను ఒక్కఇక్కరిని పిలిచి సన్మానం ప్రారంభించే ముందు ఈ సంవత్సరపు వారి పత్రిక విడుదల చేసారు.

ఓ గ్రూపు ఫోటో వచ్చింది. మా డాక్టరు గారు ముందుకు రారు. డాక్టరు గారికి ఫోటోలు తీయించుకోడానికి తొందరగా ఇష్టపడరు.

ఇంతలో ఓ వార్త గురవరెడ్డిగారు పిలవగానే కార్యకర్తలు వెంటనే స్టేజీపైకి రండి అని. దానికైతే మేం రెడీనే.

డాక్టరు గార్లకు సన్మానం చేసేటప్పుడు పిలిచారు. అందరం వెళ్ళాం. ఫోటో దిగాము. సంతోషం.

విశాఖ పురస్కారం :

పురస్కార గ్రహీతలను మాట్లాడమన్నారు. మురళీమోహన్ గారు నాగేశ్వరరరావు గారితో అనుబంధం ఆయన సెల్ఫ్,  విద్యాసాగర్ రావుగారు అంతే మాతృభాష, సెల్ఫ్ ఒక్క యార్లగడ్డ లక్ష్మీప్రసాదు గారే చల్లపల్లి వెంకయ్య నాయుడు గారితోను మరోసారి వెళ్లానని పచ్చదనం, పరిశుభ్రత అక్కడే ఉందనీ తెలిపారు.

విచిత్రం ఏమిటంటే మన వీడియో వేశారు. ముందు వరుసలో వారు చూడవచ్చు గదా. యేటి చూస్తారు. నాకుతెలుసి వారికి అర్ధంకాలేదు. ఏదో సినిమాది అనుకుని వుంటారు. లేకపోతే వారే సెల్ఫ్ తప్పితే ఏమీచెప్పలా.

గురవారెడ్డిగారిని పిలిచారు. వారు ట్రస్ట్ కార్యకలాపాల గూర్చి, డాక్టర్ గార్ల గురించి చెప్పి వెంటనే డాక్టరు గారికి మైకు ఇచ్చారు.

కార్యకర్తల వేకువ శ్రమ, ఎందుకు చేస్తున్నారు, గ్రామంకోసం రోజుకో గంట శ్రమిస్తే ఊరు బాగుపడుతుందనీ, కేవలం సంతృప్తి తప్ప వారికి వచ్చేది ఏదీ లేదనీ తెలిపారు.

వెంటనే డాక్టరమ్మగారు అందుకుని చాలా వివరంగా తాము చేసే పని వివరించారు. ట్రస్ట్ సభ్యురాలుగా కాక ఓ కార్యకర్తగా తను వారితో పనిచేసి ఆనందం పొందుతామనీ, వీలైతే ఒక్కసారి మావూరు రావలసిందనీ తెలిపారు.

అనంతరం గురవరెడ్డిగారు మురళీమోహన్ గారూ మీతో మా వాళ్ళు ఫోటో దిగుతామంటున్నారు. ఈసారి మిమ్మల్ని, శోభనాయుడు గారినీ చల్లపల్లి తీసికెళ్తాననీ పలికారు.

తోటకూర ప్రసాదు గారు స్పందించి డిసెంబర్ చివరి వారంలో మీవూరు వస్తాము, ఒక రోడ్డుకి స్పాన్సర్ చేస్తామని తెలిపారు.

పురస్కారగ్రహీతలు, ఫౌండేషన్ సభ్యులతో కార్యకర్తలు ఫొటోదిగడం గురవారెడ్డిగారి పుణ్యమే.

ఈ సందడిలో మనవారు చాలా సెల్ఫీలు దిగారు.

సభ మధ్యలో బాగా ఆకలివేసింది. ఏమీ పెట్టరా అనుకున్నాం. సమోసా వచ్చింది ముందు వరుసలో అడిగారు. ఎవరూ తీసికోలేదు పురస్కారగ్రహీతలు తీసోకేరేమో అనుకున్నాం. మాకు గూడా ఇచ్చారు అమ్మయ్య.

డాక్టరుగారు ఎప్పుడూ ఇంత తక్కువగా, డల్ గా చెప్పలా. బహుశా కిందటిరోజు తలనొప్పి తగ్గివుండదు.

మేడం గారు మాత్రం ఒక్క పాయింటు అంటూ పదినిముషాలు చెప్పారు. సూపర్.

భోజనాలు చక్కగా పెట్టారు. రాత్రి 10.30కి బయలుదేరితే ఉదయం 7.30కి చేరారు.

కొత్త కొత్త అనుభవాలు, పరిచయాలు, వింత వింత అనుభూతులేమా ఈ సుమధుర యానం.

ఇలా వ్రాయడానికి ప్రేరణ కూడా మా రధసారధులే.

అందుకే అనిపిస్తుంది. హనుమంతుని హృదయంలో సీతారాములు దాగివున్నట్లు మా తెలీదుగానీ నా గుండెలో డా.పద్మావతిగారు, డా.డీ.ఆర్కే. ప్రసాదు గారు పదిలంగా ఓ నిధిలా నిక్షిప్తమై వున్నారు.

ఏదైనా మరచినా, కొద్దిగా అతిగా వ్రాసినా ఏమీ అనుకోవద్దు. ఎంతైనా అందరిపై వుండే మమకారం, స్వాతంత్రం తోనే సాహసం చేసాను.

- ప్రాతూరి శాస్త్రి

28.10.2020.