స్వచ్చోద్యమ చల్లపల్లిలో – 2077* వ నాడు. ఈ శనివారం – 2077* వ నాటి శీతల ఉదయాన – వేకువ 4.29 - 6.10 సమయాల నడుమ - ఉపమార్గం (బైపాస్) లో కమ్యూనిస్ట్ వీధి పరిసరాలలో జరిగిన గ్రామ స్వచ్చంద విధులలో పాల్గొన్న వారు 20 మంది. అశోక్ నగర్ దగ్గర నుండి సూరి డాక్టరు వీధి దాక ఈ కొద్ది మంది శ్రమదానంతో బాగానే శుభ్రపడింది. ముఖ్యంగా – సామ్యవాద వీధి...
Read Moreచల్లపల్లి స్వచ్చోద్యమంలో – 2076* వ నాడు. ఈ బుధవారం (25.11.2020) నాటి వేకువ 4.25 నుండి 6.10 దాక నెరవేరిన గ్రామ బాధ్యతా నిర్వహణలో సమీకృతులైన స్వచ్చంద కార్యకర్తలు 20 మంది. ఆశ్చర్యకరంగా నేటి వీధి శుభ్రతా విధులలో (బహుశా ఆసుపత్రి ఉద్యోగినులు తప్ప) మహిళా కార్యకర్తల ప్రమేయం లేదు. ఒక ప్రక్క వాతావరణ శాఖ నుండి తీవ్ర తుఫాను హెచ్చరికలున్నా, గత ఆదివారం నాటి నిర్ణయం మేరకు చల్లపల్లి – బందరు జాతీయ రహదారిలో – ఆ నాటి గ్...
Read Moreస్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2075* వ రోజు ఈ ఆదివారం (22.11.2020) వేకువనే 4.19 కి, 4.27 సమయాలకు విడిగా మొదలైన చల్లపల్లి గ్రామ వీధుల పారిశుద్ధ్య విధులు 6.06 వరకు కొనసాగినవి. స్వచ్చ సుందరీకృత ప్రాంతాలు రెండు – కార్యకర్తల నిన్నటి నిర్ణయం మేరకు ముందుగా బందరు జాతీయ రహదారిలోని కమ్యూనిస్ట్ వీధి దగ్గర వాహనాలను నిలుపుకొని, వివిధ పనిముట్లతో సన్నద్ధులై తూర్పు రామమందిరం నుండి రాజ్యలక్ష్మి ఆస్పత్రి దాక టీ దుకాణాల వద్ద,...
Read Moreస్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2074* వ రోజు ఈ (21.11.2020) శనివారం నాటి వేకువ 4.30 – 6.05 సమయాల నడుమ బందరు జాతీయ రహదారిలో కొంతమేర జరిగిన గ్రామ శుభ్ర సుందరీకరణలో పాల్గొన్న కార్యకర్తలు 28 మంది. పారిశుధ్య కృషి నెలకొన్న ప్రాంతం భగత్ సింగ్ గారి దంత వైద్యశాల నుండి తూర్పు రామాలయందాక. ఒక వంక పై నుండి జాలువారుతున్న మంచు తెరతోను, మరొక వంక జాతీయ రహదారి ప్రయాణాల రద్దీతోను, వీటికి తోడు కరోనా భూతానికి చిక్కన...
Read Moreస్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం-2073*వ రోజు . కరోన విస్తృతి దృష్టిలో ఉంచుకొని ఆదివారాలు మాత్రమే సామూహిక స్వచ్చంద గ్రామ బాధ్యతలు నిర్వహించాలనే కార్యకర్తల నిర్ణయం మేరకు ఈ ఆదివారం ఉదయం 4.05-6.12 సమయాల నడుమ ఆవిష్కృతమైన వీధి శుభ్రతా చర్యలు సంతృప్తి కరంగా సాగినవి. బందరు జాతీయ రహదారిలో – ముల్పూరి రహదారి వనం నుండి ప్రముఖ దంత వైద్యశాల వరకు, కొనసాగిన పారిశుద్ధ్య – సుందరీకరణ విధులలో ఉత్సాహంగా పని చేసిన కార్యకర్తలు 32 మంది. ...
Read Moreచల్లపల్లి సమాజసేవలో అక్షరాలా ఆరేళ్లు – స్వచ్చ చల్లపల్లి సైన్యం – 2072* వ నాటి ఉత్సాహం ఈ (12-11-2020) నాటి వేకువ 4.10 – 6.00 నడుమ సమయంలో – బందరు జాతీయ రహదారిలో జరిగిన స్వచ్చంద గ్రామ కర్తవ్య పరిపూర్తిలో పాల్గొన్న మొండి కార్యకర్తలు 32 మంది. ఊరి స్వచ్చ సుందరీకరణ ప్రయత్నం జరిగింది. పింగళి మధుసూధనరావు గారి ఆస్పత్రి నుండి భగత్ సింగ్ గారి దంత వైద్యశాల దాక. ‘...
Read More2071* వ నాటి సేవా సౌభాగ్యం ఈ (8-11-2020) నాటి వేకువ 4.30 – 6.05 కాలాల నడుమ బందరు జాతీయ రహదారి మీద – 6 వ నంబరు పంట కాలువ నుండి 1 వ వార్డు ముఖద్వారం వరకు వర్ధిల్లిన గ్రామ శౌచ నిర్వహణలో శ్రమించిన స్వచ్చ సైనికులు 46 మంది. సుమారు 400 గజాల సువిశాల రహదారి, దాని ఉభయ పార్స్వాలు, నడుమ నడుమ టీకొట్లు, పండ్ల దుకాణాలు, కొబ్బరి బొండాల విక్రయ కేంద్రం, జూనియర్ కళాశాల ప్రవేశ ద్వారం,స్టేట్ బ్యాంక్ ...
Read Moreమన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-7 ఒకప్పుడు 50 ఏళ్ల క్రిందట చెర బండ రాజు అనే కవి “ విప్లవాలయుగం మనది- విప్లవిస్తె జయం మనదె..” అని మహోద్రేకంగా పాడుతూ ఉండేవాడు. అతని కవితలెంత వరకు యదార్థమో అతని స్వప్నాలెంతదాక ఋజువైనవో గాని... మన సమకాలం ముఖ్యంగా ఈ 21 వ శత...
Read Moreమన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 6 చల్లపల్లి లో 2013 లోనే అంకురించి, 2014 లో పుష్పించిన సామాజిక స్వచ్చ ఉద్యమాన్ని గాని, కాలక్రమాన ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యమాలను గాని, పరిశీలిస్తున్నపుడు – అక్కడక్కడ కొందరు వ్యక్తుల కాలుష్య నియంత్రణా కృషి, వాళ్ళ ఒంటరి పోరాట స్ఫూర్తి తళుక్కున మెరవడం గమనించవచ్చు. ఈ దేశంలోని పర్యావరణ ప్రమాదాలను శాశ్వతంగా తొలగించుకో...
Read Moreమన సమకాలంలో – ప్రత్యక్షంగా ఒంటరిగానూ, సామూహికంగానూ అన్ని కాలుష్యాల మీద కొందరు వ్యక్తులు చేస్తున్న అద్భుత సంగ్రామాలు చూస్తుంటే విప్లవ మహాకవి శ్రీ శ్రీ రాసిన పాటే గుర్తొస్తున్నది. “తూరుపు దిక్కున వీచే గాలి – పడమటి కడలిని పిలిచే గాలి ...
Read Moreమన కళ్లముందే కాలం ఎన్నెన్ని దుర్మార్గపు పోకడలు పోతుందో, దాని కడుపు నుండి ఇడీ అమీన్, అడాల్ఫ్ హిట్లర్ లాంటి రాక్షసులెందరు పుట్టుకొస్తారో, అదే గర్భం నుండి బుద్ధుడు – జీసస్ - గాంధీ వంటి దైవాంశ గల పుణ్య పురుషులు సైతం ఆవిర్భవించి, మానవ మాత్రుల్లోని రాక్షసాంశలను ఎలా దుంపనాశనం చేస్తూ పోతారో పరిశీలిస్తుంటే భలే విచిత్రంగా ఉంటుంది! ఇప్పటికిప్పుడు – ఈ శతాబ్దంలోనే మనం చూస్తుండగానే కాలమనే మహాక్షీర సముద్రం కడు...
Read More